“దసరా” అఫీషియల్ రన్ టైం..సెన్సార్ టాక్ ఏమిటంటే.!

నేచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు తన నుంచి సరికొత్త వెర్షన్ ని ప్రెజెంట్ చేసే ప్రయత్నంగా చేసిన సినిమానే “దసరా” భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని అయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ఈ మార్చ్ 30 న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుండగా.

అయితే ఆల్రెడీ సినిమాకి భారీ డిమాండ్ అంతకంత పెరుగుతుంది. కాగా ఈ సినిమా నుంచి అయితే ఇప్పుడు మేకర్స్ అధికారిక అప్డేట్ కొన్ని ఇచ్చారు. ఈ సినిమా అయితే సెన్సార్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలిపారు. కాగా ఈ సినిమా అయితే యూ/ఏ సరిఫికేట్ ని అందుకోగా..

ఈ సినిమా టైటిల్ టోటల్ గా అయితే 2 గంటల 36 నిముషాలు ఉంటుంది అని రన్ టైం ని కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి సినిమా చూసిన సెన్సార్ యూనిట్ టాక్ కూడా తెలుస్తుంది. సినిమాకి వారి నుంచి చాలా పాజిటివ్ టాక్ వచ్చినట్టుగా తెలుస్తుంది.

సెన్సార్ వారు చిత్ర యూనిట్ ని అభినందించారని సినిమా చూసి వారు ఇంప్రెస్ అయ్యారని ఇన్సైడ్ టాక్. దీనితో దసరా కి అయితే మంచి పాజిటివ్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాలో సముద్రఖని తదితరులు నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.