లేటెస్ట్ : ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “దసరా” వచ్చేసింది.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మొదటి పాన్ ఇండియా రిలీజ్ అయ్యిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “దసరా” అనే చెప్పాలి. నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నాని కెరీర్ లోనే భారీ హిట్ అయ్యింది.

అంతే కాకుండా నాని కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు కూడా రాబట్టి అసలు నాని బాక్సాఫీస్ స్టామినా ని అయితే ప్రూవ్ చేసింది. మరి అనుకున్నట్టుగా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా హిట్ అయ్యి ఉంటే డెఫినెట్ గా 200 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

కాగా ఈ సినిమా ఇప్పుడు ఆల్రెడీ ఆల్ మోస్ట్ థియేటర్స్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఫైనల్ గా అయితే ఓటిటి లో కూడా రిలీజ్ కి వచ్చేసింది. కాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఈ సినిమా అయితే నేటి నుంచే ఆన్లైన్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

హిందీ భాష మినహా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి చూసే వారు అయితే ఇప్పుడు మరోసారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక ఈ సినిమాకి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వర్క్ చేయగా ఈ సినిమాతో తనకి భారీ గుర్తింపు వచ్చింది.

ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాకి అయితే సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ప్రొడక్షన్ హౌస్ ఎస్ ఎల్ వి సినిమాస్ వారు అయితే ఫస్ట్ కమర్షియల్ హిట్ ని తమ బ్యానర్ లో అందుకున్నారు.