ఓటిటి : “దసరా” కొత్త వెర్షన్ తో అఫీషియల్ రిలీజ్ అప్పుడే.!

టాలీవుడ్ టైర్ 2 టాప్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “దసరా” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ మరియు రికార్డు వసూళ్లు అయితే నమోదు చేసింది.

కాగా మొదట్లో హైప్ తో అయితే భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా తర్వాత భారీ డ్రాప్ తో అయితే యావరేజ్ గానే మారింది. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ ని అయితే మొదట్లో 8 వారాల తర్వాత ఫిక్స్ చేసిన మేకర్స్ ఇప్పుడు అనూహ్యంగా 4 వారాలకే తీసుకొచ్చేస్తున్నారు.

ఈ సినిమా ఓటిటి హక్కులు ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో ఈ సినిమా ఇపుడు ఈ ఏప్రిల్ 27 నుంచే పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ వారు కూడా తమ యాప్ లో డేట్ ని పొందుపరిచారు.

దీనితో ఈ సినిమా ఓటిటి డేట్ కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ సినిమా అయితే కొత్త వెర్షన్ ఉంటుందని తెలుస్తుంది. థియేటర్స్ లో వచ్చిన అన్ కట్ వెర్షన్ కాకుండా ఇందులో అన్ని డైలాగ్స్ ఉంటాయని లేటెస్ట్ బజ్ ప్రకారం వినిపిస్తుంది. దీనితో అభిమానులు అయితే దీనిని మరింత ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సముద్రఖని, సాయి కుమార్, దీక్షిత్ శెట్టి తదితరులు నటించగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.