దసరా ట్రైలర్ వచ్చేది అప్పుడే

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దసరా. నాని కెరియర్ లో ఫుల్ మాస్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమా రాబోతూ ఉండటం విశేషం. ఈ మూవీలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణలో ఓ మారుమూల పల్లెటూరిలో జరిగే కథగా ఉండబోతుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ని దర్శకుడు శ్రీకాంత్ ప్రేక్షకులకి అందించి సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు.

ఇక సాంగ్స్ కూడా రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫరెంట్ ఫీల్ తో కనెక్ట్ అయ్యాయి. ఈ నేపధ్యంలో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల వరకు థీయాట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. నాని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా దసరా మూవీ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ మార్చి 30 పాన్ ఇండియా లెవల్ లో ఏకంగా ఐదు భాషలలో రిలీజ్ అవుతుంది.

పుష్ప హిట్ కావడంతో అలాంటి కథాంశంతోనే రాబోతున్న ఈ మూవీకి కూడా కచ్చితంగా ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కి సంబందించిన డేట్ ని ఫిక్స్ చేశారు. మార్చి 16న దసరా మూవీ ట్రైలర్ ని ప్రేక్షకులకి అందించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచడంతో ఈ ట్రైలర్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు.

ఇక నేచురల్ స్టార్ నాని కూడా దసరా సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తన కెరియర్ లో డిఫరెంట్ కథాంశంతో చేస్తున్న సినిమా కావడం, పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న మూవీ కావడంతో చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ మూవీ హిట్ అయితే నెక్స్ట్ సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా లెవల్ లోనే ప్లాన్ చేసుకోవడానికి నాని సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.