Dasara: ఈ సెంటిమెంట్ అంటే హిట్టే..

అదేంటో కొన్ని కాంబోలు, కొన్ని డేట్లు కొన్ని వారాలు కొంత మందికి కలిసి వస్తాయి. ముఖ్యంగా సినిమాల్లో ఇవా బాగా క్లిక్ అవుతుంటాయి. ఒకసారి హీరో హీరోయిన్లు, హీరో హీరోయిన్లు డైరెక్టర్ల కాంబోలో వచ్చిన సినిమాలు.. రికార్డులను క్రియేట్ చేస్తుంటాయి. అందులోకే వస్తుంది మార్చి 28వ తేదీ. గతంలో ఈ తేదీ రోజు విడుదలైన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఎన్టీఆర్ అడవి రాముడు, బాహుబలి, యమలీల, పోకిరి మార్చి 28వ తేదీనే రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడు ఇదే కోవలోకి మార్చి 30వ తేదీ కూడా చేరింది. అయిదేళ్ల క్రితం 2017లో విడుదలైన రంగస్థలం అప్పటిదాకా రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులు నమోదు చేసింది. దర్శకుడు సుకుమార్ మాస్ యాంగిల్ పూర్తిగా బయటకు వచ్చింది ఈ సినిమాతోనే. సరిగ్గా ఇదే తీదీ నాడు నేచురల్ స్టార్ నాని చిత్రం రిలీజ్ అయింది.

అనూహ్యంగా ఇది నానికి హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవబోతోంది. మొదటి రోజే బాక్సాఫీసు మొత్తం షేకై పోయింది. దీని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సుకుమార్ శిష్యుడు కావడం గమనార్హం. ఇదొక్కటే కాదు రంగస్థలం సినిమా కోసం పని చేసిన కీలక సభ్యుల్లో ఇతను కూడా ఒకడు. దాని సక్సెస్ మీట్ లో ప్రత్యేకంగా స్టేజీ మీదకు పిలిచి మరీ శ్రీకాంత్ ఓదెలను మెచ్చుకునే వీడియో తాజాగా నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఈ రెండు సినిమాలు ముప్పై, నలభై ఏళ్ల వెనకటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందటం, ఒఖ దాంట్లో అన్నయ్య మరో దాంట్లో స్నేహితుడు ట్రాజెడీ మీద రివెంజ్ చూపించడం ట్విస్ట్. ఈ రకంగా మార్చి 30వ తేదీ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయేలా ఉంది. మండే ఎండల్లో జనాలు థియేటర్ల వద్దకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపకపోయిన సినిమా బాగుందనే టాక్ తో సినిమా చూసేందుకు చాలా మంది వస్తున్నారు.

బాక్సాఫీసును బద్దలు చేస్తూ.. దసరాకు విపరీతమైన క్రేజ్ తీసుకు వస్తున్నారు. అప్పట్లో రంగస్థలంలో రామ్ చరణ్ మేకోవర్ ఏ రకంగా షాక్ ఇచ్చిందో ఇప్పుడు నాని కొత్త వేషం కూడా సినీ ప్రేక్షకుల్ని అలాగే మెస్మరైజ్ చేసింది. అందుకే గొప్పగా ప్రశంసలు అందుకుంటోంది. వీటిలో హీరోయిన్లుగా నటించిన సమంత, కీర్తి సురేష్ లకు కూడా మంచి పేరు రావడం గమనార్హం.