శ్రీలీలకి డేంజర్ బెల్స్.!

ఒక్క సినిమా.. శ్రీలీలకి డేంజర్ బెల్స్ మోగించేస్తోందిట. అదే, ‘స్కంద’.! బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ‘స్కంద’ తెరకెక్కడం, ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిన సంగతే.

సినిమా డిజాస్టర్ అని తేల్చేశారు. కాదు కాదు.. ముక్కీ మూలిగీ.. బాగానే వుందనిపించుకునే అవకాశం వుందని ఇంకొందరు అంటున్నారు. థియేటర్లు అయితే వెలవెలబోతున్నాయి. తెరపై రామ్ పోతినేనిని భరించలేకపోతున్నారు ఆడియన్స్.

రామ్ పోతినేని కంటే, ఈ సినిమాకి సెంటరాఫ్ ఎట్రాక్షన్ శ్రీలీల.. అని ప్రచారం జరిగింది రిలీజ్‌కి ముందు. థియేటర్లకు వెళితే, అక్కడ శ్రీలీల ‘షో’ ఏమీ లేకుండా పోయిందాయె. మంచి డాన్సర్ అయిన శ్రీలీలని సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. శ్రీలీల క్యూట్ అప్పీల్ కూడా లేకుండా పోయిందాయె.

ఇదంతా ఓ ఎత్తు.! దర్శకుడు వాడుకోలేదు సరే, కథ విన్నప్పుడైనా కాస్తంత ఆలోచించుకోవాలి కదా.? ఇలాంటి సినిమాలు చేస్తే, కెరీర్ నాశనమైపోద్ది.. అంటూ ‘స్కంద’ విడుదలయ్యాక శ్రీలీలకి క్లాసులు ఎక్కువైపోయాయట.

మరోపక్క, శ్రీలీల ఫేడవుట్ అయిపోయిందన్న ప్రచారంతో, ఆమెకు దక్కాల్సిన అవకాశాలూ వెనక్కి వెళ్ళిపోతున్నాయంటూ గుసగుసలు ఎక్కువైపోయాయ్. స్టార్‌డమ్ అంటేనే అంత. రాత్రికి రాత్రి వస్తుంది.. అలాగే పోతుంది కూడా.!

ఇప్పటికిప్పుడు శ్రీలీలకు వచ్చిన నష్టమేమీ లేదుగానీ, ఇంకో సినిమా ఇలాంటిది పడితే.. అంతే సంగతులు.! కాస్తంత జాగ్రత్త శ్రీలీలా కథల ఎంపిక విషయంలో.!