అనుకున్నదే జరిగింది.! ‘రానా నాయుడు’కి వెంకీ మార్కు కోత.!

దగ్గుబాటి బాబాయ్ – అబ్బాయ్ కాంబినేషన్‌లో ఇటీవల ఓటీటీలో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ నలుగురి నోళ్లలో బాగా నానిన సంగతి తెలిసిందే.

ఈ వెబ్ సిరీస్‌లోని హద్దులు మీరిన బూతు కంటెంట్‌కి నలుగురూ నోరు పారేసుకున్నారు. ఈ వయసులో ఇదేం వెర్రి వెంకటేష్‌కి అని ముఖం చిన్నబుచ్చుకున్నారు. ఇలా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ విమర్శల పాలవుతూనే మరో వర్గం ద్వారా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

కంటెంట్ పరంగా అలా ఈ సిరీస్‌ని ఒకింత తిట్టుకుంటూనే అడల్ట్ ఖాతాలో హిట్ చేసేశారు. తిట్టుకుంటూనే చూసేశారు చాలా మంది ఈ సిరీస్‌ని. ఆ రకంగా మేకర్లు హ్యాపీనే. కానీ, వెంకీ ఫ్యామిలీ ఇమేజ్‌కి మాత్రం డ్యామేజ్ బాగానే పడింది.

దాంతో, సెకండ్ సిరీస్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారట. వెంకీ పార్ట్ వరకూ కాస్త బూతు కంటెంట్‌ని లిమిట్ చేశారట. రానా పాత్ర అయితే, మొదటి పార్ట్‌లో మాదిరిగానే అంతే వైల్డ్‌గా చూపించబోతున్నారట.

అతి త్వరలోనే ‘రానా నాయుడు’ రెండో సిరీస్ రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి, చెప్పినట్లుగా ఏం మార్పులు చేశారో.