గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి మన హీరోలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఫ్యామిలీ సభ్యులతోనే కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక త్వరలో అక్కినేని వారి నుంచి కూడా ఒక మల్టీస్టారర్ వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఆ తరువాత ఎవరు వచ్చినా రాకపోయినా కూడా దగ్గుబాటి హీరోలు మాత్రం ఒక మంచి సినిమాతో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానా దగ్గుబాటి, వెంకటేష్ మల్టీస్టారర్ ప్రాజెక్టు ప్లాన్ ఈనాటిది కాదు. రామానాయుడు ఎప్పుడో అనుకున్నారు. ఇక దగ్గుబాటి సురేష్ బాబు ఆ డ్రీమ్ ప్రాజెక్టు కోసం ఒక ప్లాన్ అయితే రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ బాబు ఒక వివరణ ఇచ్చారు. శతమానం భవతి లాంటి మంచి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సతీష్ వేగేశ్న ఆ మల్టీస్టారర్ కథను తెరకెక్కించలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ దర్శకుడు కోతి కొమ్మోచ్చి సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది దగ్గుబాటి వారి మల్టీస్టారర్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.