సమంత ఒప్పుకుంటే..”యశోద” పై క్రేజీ అప్డేట్ ఇచ్చారుగా.!

పాన్ ఇండియా హీరోయిన్ సమంత ఇప్పుడు హీరోయిన్ రోల్ నుంచి తానే మెయిన్ లీడ్ లో నటించే సినిమాలు ఎక్కువ చేసే స్టేజ్ కి అయితే వచ్చేసింది. ఇక ఇప్పుడు సమంత నటించిన లేటెస్ట్ సినిమా “యశోద” పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి భారీ హిట్ టాక్ తెచ్చుకొని ఆమె కెరీర్ లో మరో హిట్ తో పాటుగా అదిరే కం బ్యాక్ ని కూడా సినిమాలో అందుకుంది.

ఇక ఈ చిత్రం అయితే సమంత కెరీర్ లో అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై అయితే ఓ అదిరే అప్డేట్ ని దర్శకులు హరి మతియు హరీష్ లు అందించారు. యశోద కి సీక్వెల్ ఉందా లేదా అనే దానిపై మాట్లాడుతూ డెఫినెట్ గా ఉందనే చెప్తున్నారు.

అయితే ఇప్పుడు సమంత ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆమె పూర్తిగా రికవర్ అయ్యాక సీక్వెల్ కోసం చర్చిస్తామని చెప్పారు. అలాగే ఒకవేళ ఓకే అయితే మాత్రం మొత్తం 3 పార్టులుగా ఈ సినిమా ఉంటుంది అని కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే ఈ లెక్కన యశోద 2 మరియు 3 చిత్రాలు ఉండే అవకాశం ఉందని చెప్పాలి. మరి ఇదంతా ఎప్పుడుకి అవుతుందో చూడాలి మరి.