లేటెస్ట్ : వరల్డ్ వైడ్ బాలయ్య టీజర్ కి టైం లాక్.!

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు రెండు వరుస హిట్స్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి రావడమే కాకుండా గతంలో చేసిన రొటీన్ లైనప్ కి భిన్నంగా అదిరే సినిమాలు అయితే ఓకే చేస్తూ దూసుకెళ్తున్నారు. మరి అలా అఖండ, వీరసింహా రెడ్డి లాంటి హిట్స్ తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడితో అయితే చేస్తున్న సినిమానే “భగవంత్ కేసరి”.

మరి నిన్ననే ఈ సినిమా నుంచి మేకర్స్ టైటిల్ అనౌన్స్ చేయగా దీనికి అదిరే రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ బాలయ్య బర్త్ డే కానుకగా మాస్ టీజర్ ని ఇస్తున్నట్టుగా కూడా ఫిక్స్ చేయగా లేటెస్ట్ గా దీనిపై క్రేజీ అప్డేట్ ని అందించారు.

కాగా ఈ టీజర్ ని అయితే వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో 108వ సినిమా కనుక మొత్తం 108 థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా స్క్రీనింగ్ చేస్తున్నారు. మరి ఇదో ఇంట్రెస్టింగ్ మూవ్ కాగా ఇప్పుడు టీజర్ లాంచ్ టైం ని మేకర్స్ ఫిక్స్ చేశారు.

మరి ఈ మాస్ టీజర్ అయితే రేపు ఉదయం 10 గంటల 19 నిమిషాలకి అయితే లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే రేపు బిగ్ ట్రీట్ బాలయ్య ఫాన్స్ కి ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా  లీల ఓ కీలక పాత్ర చేస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.