మరోసారి పాన్ ఇండియా కాంబినేషన్ తెరపైకి రానుంది. 2020లో ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు దక్కించుకున్న తమిళ చిత్రం సురారైపొట్రు (తెలుగులో అకాశమేహద్దు) దేశ వ్యాప్తంగా మంచి జనాదరణ పొందిన విషయం తెలిసిందే. ఇందులో సూర్యా, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించగా జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు, సుధ కొంగర దర్శకత్వం వహించారు.
ఇప్పుడు మళ్లీ మూడు సంవత్సరాల తర్వాతా దాదాపు అదే కాంబినేషనలో రెండో సినిమా సూర్యా 43 కోసం వారంతా చేతులు కలుపుతున్నారు. ఆ సినిమాలో నటించిన అపర్ణ బాలమురళి మినహ మిగతా వారంతా ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం మేకర్స్ చిత్ర విశేషాలను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించబోయే తారల లిస్టు కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది.
అందుతున్న సమాచారం ప్రకారం మళయాళ స్టార్స్ దుల్హర్ సల్మాన్ , నజిరియా నజిమ్, బాలీవుడ్ యాక్టర్ మన హైదరబాదీ విజయ్ వర్మ ముఖ్య భూమికలు పోషించనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిచనున్నాడు. కాగా ఈ సినిమా 1967లో తమిళనాట జరిగిన హిందీ మూమెంట్, ఆ సమయంలో తమిళనాడు పరిస్థితుల అధారంగా నిజ జీవిత కథతో తెరకెక్కిస్తున్నట్లు సోషల్ విూడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే సురారై పొట్రు సినిమాలో భారతదేశంలో మొదటిసారిగా అతి తక్కువ డబ్బుతో ఎయిర్ డెక్కన్ విమాన సర్వీసులు అందించిన జీఆర్ గోపినాథ్ బయోపిక్ తెరకెక్కించిన సుధ కొంగర మరోమారు ట్రూ ఈవెంట్స్‌తో సూర్యా వంటి పెద్ద స్టార్‌తో సినిమా చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. ఇదిలాఉండగా సుధ కొంగర తెలుగులో చివరగా విక్టరీ వెంకటేశ్ గురు చిత్రానికి దర్శకత్వం వహించారు.