క్రేజీ బజ్ : మెగాస్టార్ “విశ్వంభర” రిలీజ్ డేట్ ఇదే..

తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు దర్శకుడు వసిష్ఠ తో ఒక మాసివ్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా “విశ్వంభర” చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా రీసెంట్ గానే ఇచ్చిన టైటిల్ టీజర్ చూసాక భారీ లెవెల్లో విజువల్స్ ని ప్రామిస్ చేసింది. దీనితో విశ్వంభర చిత్రం అసలు ఏ లెవెల్లో ఉంటుంది అనేది అర్ధం అయ్యింది.

ఇక ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మిగతా షూటింగ్ ని కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరింత ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ చిత్రం రిలీజ్ విషయంలో మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అనేది తెలుస్తుంది.

చిత్ర యూనిట్ ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ సంక్రాంతి రిలీజ్ కి ఫిక్స్ చేయగా ఇప్పుడు అందుకు డేట్ కూడా ఖరారు అయ్యినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ సినిమా రిలీజ్ జనవరి 10న ఖరారు చేసినట్టుగా సినీ వర్గాల్లో స్ట్రాంగ్ న్యూస్ వినిపిస్తుంది. దీనితో మెగాస్టార్ మళ్ళీ 2025 సంక్రాంతికే రాబోతున్నారు అని చెప్పాలి.

మరి దీనిపై అతి త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని కూడా టాక్. కాగా ఈ భారీ చిత్రంలో మంచి ఎమోషన్స్ కూడా ఉండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే 200 కోట్లకి పైగా బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.