క్రేజీ ఇన్ఫో : “గుంటూరు కారం” ఓరోజు ముందే.?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా ఇది అని తప్ప ఇంకే అంశంలో కూడా ఎలాంటి హైప్ ఈ చిత్రంపై గాని ఆడియెన్స్ లో కూడా కానీ లేదు. అయితే ఈ సినిమా బాగా లేట్ అవుతూ వస్తుండడమే ప్రధాన కారణం అని చెప్పడంలో డౌటే లేదు.

ఇలా చేజేతులా సినిమాపై హైప్ ని మేకర్స్ నే కిల్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఏకంగా హీరోయిన్ పూజా హెగ్డే ని పక్కన పెట్టేయడం ఒకెత్తు అయితే మళ్ళీ సినిమా సబ్జెక్టు మార్పులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఓ క్రేజీ ఇన్ఫో గుంటూరు కారం పై ఇపుడు సినీ వర్గాల్లో అది కూడా మహేష్ సంబంధించి కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ నుంచి తెలుస్తుంది.

దీనితో అయితే ఈ చిత్రం జనవరి రిలీజ్ డేట్ 13 నుంచి అయితే ఓ రోజు ముందే అంటే జనవరి 12నే గుంటూరు కారం రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో అయితే ఇపుడు మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుండగా..

మరో యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా నటిస్తుంది అని రూమర్ ఉంది. ఇంకా థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ జూన్ 24 నుంచి అయితే సరికొత్త షెడ్యూల్ తో కొన్ని రోజులు నాన్ స్టాప్ ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది.