నిహారిక పెళ్ళికి వ‌రుణ్‌కి కాబోయే భార్య వ‌చ్చిందా?.. ఇప్పుడంతా ఇదే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల త‌న‌య నిహారిక పెళ్లి డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాల‌కు మిథున ల‌గ్నంలో జ‌రిగింది. ఈ పెళ్ళి వేడుక‌కు మెగా ఫ్యామిలీతో పాటు కొద్ది మంది స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రయ్యారు. ఇండ‌స్ట్రీకి సంబంధించి లావణ్య‌ త్రిపాఠి, రీతూ వ‌ర్మ‌, మెహ‌ర్ ర‌మేష్ పాల్గొన్నారు. ఉద‌య్ పూర్ కోట‌లో గ‌త మూడు రోజుల నుండి ఈ పెళ్లి హంగామా న‌డుస్తుండ‌గా, వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చేస్తున్నాయి. అయితే మరికొద్ది రోజుల‌లో వ‌రుణ్ తేజ్ పెళ్లి వేడుక కూడా జ‌ర‌గ‌నుండ‌గా, ఆయ‌న‌కు కాబోయే భార్య కూడా నిహారిక పెళ్ళికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం

వ‌రుణ్ తేజ్ చేసుకోబోయే అమ్మాయి ప్ర‌ముఖ హీరోయిన్, నిహారిక ఫ్రెండ్ లావ‌ణ్య త్రిపాఠి అని అంటున్నారు. లావ‌ణ్య .. వ‌రుణ్‌తో క‌లిసి మిస్ట‌ర్, అంత‌రిక్షం సినిమాలో న‌టించింది .ఆ స‌మ‌యంలోనే వారిద్ద‌రి మధ్య ల‌వ్ ట్రాక్ న‌డించిందని అంటున్నారు. ఇండ‌స్ట్రీకి చెందిన చాలా ఫేమ‌స్ హీరోయిన్స్ ఉన్న‌ప్ప‌టికీ, స్పెష‌ల్‌గా లావ‌ణ్య‌కు ఆహ్వానం అంద‌డంతో వీరిద్ద‌రికి త్వ‌ర‌లో పెళ్లి వేడుక జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. మిస్టర్ సినిమా అప్పుడే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అంత‌రిక్షం అప్పుడు అది బ‌ల‌ప‌డింద‌నే టాక్ న‌డుస్తుంది.

గ‌తంలో నాగ‌బాబు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో నిహారిక పెళ్లి పూర్తి కాగానే వ‌రుణ్ తేజ్ పెళ్ళి చేస్తాన‌ని అన్నారు . 2021 ఎండింగ్‌లో కాని.. 2022 ప్రారంభంలోకాని వరుణ్ తేజ్ పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు నాగబాబు. అమ్మాయి ఎవ‌ర‌నే దానిపై ఇప్ప‌టికీ సస్పెన్స్ ఉంచ‌డంతో అంద‌రిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుంటాడ‌ని వ‌స్తున్న వార్త‌లలో నిజం లేద‌ని కొంద‌రు చెబుతున్నారు. ఆమెకు నిహార‌క‌, వ‌రుణ్‌ల‌తో మంచి ఫ్రెండ్‌షిప్ ఉందే త‌ప్ప మెగా కోడ‌లు కాదని అంటున్నారు