గాసిప్స్ : లోకేష్ తో అల్లు అర్జున్ సినిమా? ఇది ఎంతవరకు నిజం అంటే.!

ఇప్పుడు కొన్ని కాంబినేషన్ లు ఓ రేంజ్ లో హైప్ ని తీసుకొస్తున్నాయి. ఓ టాలెంటెడ్ దర్శకుడితో ఇంకో స్టార్ హీరో అందులోని పాన్ ఇండియా లెవెల్ హీరో అయితే ఆ సినిమా జస్ట్ బజ్ తోనే ఇంకో లెవెల్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ తరహా కాంబినేషన్ సెట్ అయ్యినట్టుగా సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ గా సౌత్ సెన్సేషన్ గా మారిన లోకేష్ కనగ రాజ్ మరియు పుష్ప తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని రేపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త గాసిప్స్ మొదలయ్యాయి. అయితే దీనిపై క్లారిటీ తెలుస్తుంది. అసలు ఈ రూమర్స్ లో ప్రస్తుతం ఎలాంటి నిజం లేదట.

అల్లు అర్జున్ ప్రెజెంట్ పుష్ప 2 మూడ్ లోనే ఉన్నాడు ఇంకా ఏ సినిమాకి కమిట్ అవ్వలేదని తెలుస్తుంది. కాకపోతే ఈ ఏడాది దసరా లోపు ఒక సినిమా కమిట్ అయ్యి దానిని దసరా కానుకగా అనౌన్స్ చేయనున్నారు తప్పితే లోకేష్ కనగ రాజ్ అల్లు అర్జున్ లైనప్ లో లేడనే ఇప్పుడు తెలుస్తుంది.

ఆల్రెడీ లోకేష్ అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ఓకే చేసాడు. ఇప్పుడు విక్రమ్ తర్వాత వెంటనే తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయనున్నాడు. విజయ్ ఇప్పుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయనుండగా అది కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది.

ఆ సమయానికి పుష్ప షూటింగ్ లో ఉంటుంది. ఈ లెక్కన చూస్తే లోకేష్ తో సినిమా ఎప్పటికి మొదలవ్వాలి? దీనితో ఈ కాంబోలో ఇప్పుడప్పుడే సినిమా అసాధ్యం అని చెప్పాలి. దీనితో కొన్నాళ్ళు అయితే ఆగక తప్పదు.