క్రేజీ – ఇండియా బాక్సాఫీస్ దగ్గర “ధమాకా” సినిమా సెన్సేషన్.!

ravitejadu-du-song-from-dhamaka

ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి వచ్చిన ఎన్నో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇక ఈ చివరి నెల డిసెంబర్ లో వచ్చిన లాస్ట్ హిట్ సినిమా “ధమాకా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అయితే రిలీజ్ అయ్యి ఇప్పుడు వారం కవచినా కూడా ఇంకా అదిరే వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది.

మరి ఈ సినిమా ఈ డిసెంబరు 1 అడ్వాంటేజ్ తో కూడా మరిన్ని గట్టి వసూళ్లు నమోదు చేయడమే విశేషం అనుకుంటే ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ కూడా ధమాకా అడ్డరగొట్టినట్టు చిత్ర యూనిట్ చెప్తున్నారు. మరి ఈ సినిమా అయితే ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ వారం రోజుల్లో అయితే టాప్ 3 వసూళ్లు అందుకున్న సినిమాగా ధమాకా మూడో సినిమాగా నిలిచింది.

పైగా మరో పక్క అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా అవతార్ 2 ఇంకా ధమాకా సినిమాలు మాత్రమే టాప్ గ్రాసర్స్ గా నిలిచినట్టు తెలిపారు. అలాగే ఇండియాలో అయితే అవతార్ 2, హిందీ చిత్రం సర్కస్ ల తర్వాత ధమాకా సినిమా మాత్రమే అధిక వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచినట్టు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సగర్వంగా వ్యక్తం చేశారు.

మొత్తానికి అయితే మాస్ మహారాజ్ బ్యాంగ్ మాములుగా లేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.