“దసరా” పై ఉన్న ట్రూ హైప్ కి నిదర్శనం ఇవే.!

Dasara-Still-7-1024x576

మళ్ళీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ నుంచి ఓ పాన్ ఇండియా సినిమా కి అసలు సిసలైన డిమాండ్ అయితే ఇపుడు నెలకొంది. కాగా ఆ సినిమానే “దసరా” కాగా నేచురల్ స్టార్ నాని హీరోగా ఇందులో నటించాడు. అలాగే కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అయితే ఈ సినిమాని తెరకెక్కించాడు.

మరి మొదటి నుంచి కూడా భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి దగ్గర పడుతున్నప్పటికీ ఓ రేంజ్ లో హైప్ ని పెంచుకుంటుంది తప్పితే ఎక్కడా తగ్గడం లేదని చెప్పాలి. కాగా అసలు ఈ సినిమాకి నిజంగానే హైప్ ఉందా లేక మేకర్స్ తామంతా తాము డబ్బా కొట్టుకుంటున్నారు అనేది చూస్తే.

దసరా కి ట్రూ హైప్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కనిపిస్తుంది. ఒక్క ఇండియా లోనే కాకుండా ఈ సినిమాకి యూఎస్ లో కూడా ఆల్ టైం ఇండియా టాప్ 3 రిలీజ్ గా ఈ సినిమా రెడీ అవుతుంది అంటే అర్ధం చేసుకోవాలి ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంత క్రేజీ గా ఉన్నారో అనేది. ఇక మరో పక్క అయితే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి కన్నడ లో కూడా భారీ పోటీ నెలకొందట.

అక్కడ కేజీఎఫ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాకి రికార్డు ధర ఇచ్చి కన్నడ హక్కులు కొనుక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా ఇప్పుడు టాక్. ఇక హిందీలో కూడా దసరా కి మాసివ్ డిమాండ్ నెలకొనగా తెలుగులో అయితే చెప్పక్కర్లేదు. ఇలా ఓవరాల్ గా అయితే ఒక ట్రూ హైప్ లో ఈ సినిమా కి ఉందని చెప్పడంలో సందేహమే లేదు.