దక్షిణాదిన లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు నయనతార. గ్లామర్ పాత్రలతోపాటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు పెద్ద పీట వేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తుంది. అంతే కాదు నిర్మాణరంగంలోనూ దిగింది. తాజాగా నయన తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ‘9 స్కిన్’ అనే బ్యూటి కేర్ బిజినెస్ ప్రారంభించింది.
ఈ సంస్థ నుంచి వచ్చే ఉత్పత్తులను స్వయంగా ఆమె ఉపయోగించి అంతా ఓకే అనుకున్నాకే మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కాస్మోటిక్స్ ఇండియాతోపాటు మలేషియా మరియు సింగపూర్‌లలో కూడా మార్కెట్ చేస్తున్నారు. కొత్త కంపెనీ కావడం, పైగా సొంతది కావడంతో నయన బాగానే ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగానే తన స్నేహితురాలు సమంతకు నయనతార ‘9 స్కిన్’ నుంచి కాస్మోటిక్స్ గిఫ్టుగా పంపి ఆశ్చర్యపరిచింది.
ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది సమంత. ‘స్కిన్ 9’ ఉత్పత్తులు అద్భుతంగా ఉన్నాయి. వీటిని వాడేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. థ్యాంక్యూ నయనతార. ‘9 స్కిన్’కి ఆల్ ది వెరీ బెస్ట్’ అని సమంత తన ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల నయన జవాన్ చిత్రంతో అలరించారు.
తాజాగా గాడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సమంత తను అంగీకరించిన చిత్రాలు పూర్తి చేసిన ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నారు. ఆమె నటించిన సటాడెల్ విడుదలకు సిద్ధమవుతోంది.