టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్ బాబు తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో తీయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రకటించాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన అతడు ఖలేజా సినిమాలు మంచి హిట్ అయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్లో పదేళ్ల తర్వాత రాబోతున్న మూడవ సినిమా కావటంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మహేష్ ,త్రివిక్రమ్ కామినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కథ మొత్తం ఒక ఏడేళ్ల బాలిక చుట్టు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆ చిన్నారి పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు అర్హ ని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కూతురు అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాలో నటించిన సంగతి అందరికీ. సమంత కీలకపాత్రలో నటించిన ఈ సినిమా ద్వారా అల్లు అర్హ మొట్ట మొదటిసారిగా సినిమాలలోకి అడుగు పెట్టింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా నటించే అవకాశం అర్హ కి వచ్చింది. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తాడా? లేదా ? ప్రేక్షకులలో ఒక అనుమానం మొదలు అయింది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య కోల్డ్ వార్ జరగటం సర్వసాధారణం. ఈ క్రమంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య కూడా చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ఇద్దరి మధ్య గ్యాప్ ఉండటంతో మహేష్ బాబు సినిమాలో నటించటానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఒకవేళ అల్లు అర్జున్ కూతురు అర్హ మహేష్ బాబు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ దొరికితే మాత్రం మహేష్ బాబు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం ఖాయమని అల్లు అర్జున్ అభిమానులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.