గుంటూరు.! బేజారు.! ఏంటి గురూజీ ఇది.?

‘గుంటూరు కారం’ సినిమా పరిస్థితేంటి.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. సంగీత దర్శకుడు మారుతున్నాడట.! హీరోయిన్లు మారిపోతున్నారట.! టెక్నీషియన్లూ మారిపోతున్నారట.! ఎన్నెన్ని గాసిప్పులో.. ఎన్నెన్ని ప్రచారాలో.! కొన్ని నిజమవుతున్నాయ్ కూడా.!

ఇంతకీ, ‘సంక్రాంతి’కి ఈ సినిమా విడుదలవుతుందా.? లేదా.? సినిమా విడుదలవ్వాలంటే, షూటింగ్ అయితే ముందుకు కదలాల్సిందే కదా మరి.! కానీ, కదలడంలేదు.

మొదలవుతోంది, ఆగుతోంది.. మళ్ళీ మొదలవుతోంది.. మళ్ళీ ఆగుతోంది. ఈలోగా, టెక్నీషియన్లు.. నటీనటులు మారిపోతున్నారు. ఇలాగైతే ఎలా.? త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ‘బ్రో’ సినిమా కారణంగా చాలా నెగెటివిటీ పెరిగిపోయింది.

‘సినిమా ఆపెయ్ అన్నా..’ అంటూ మహేష్‌ మీద అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు. ఏమో, మహేష్ ఏ క్షణమైనా కీలక నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. కీలక నిర్ణయంటే.. సినిమాని ఆపేయడమేనా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!