Devi Sri Prasad: నెగిటివ్ కామెంట్స్ కు దేవి సమాధానమిదే..

Devi Sri Prasad: సూర్య నటించిన భారీ పాన్ ఇండియా సినిమా ‘కంగువా’పై ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం, గత ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిజాస్టర్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం గురించి చర్చలు జరగడం హాట్ టాపిక్ గా నిలిచింది. ‘కంగువా’లోని బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ చాలా మంది ప్రేక్షకులు తట్టుకోలేకపోయారనే కంసన్స్ కూడా వినిపించాయి.

పాత్రల అరుపులు, నేపథ్య సంగీతం చాలా లౌడ్‌గా ఉండటంతో, ప్రేక్షకులు అసహనానికి లోనయ్యారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల సమయంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా పని చేసిన ఆస్కార్ విన్నర్ రసూల్ కూడా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ కారణంగా సినిమా మళ్ళీ చూడాలనిపించదని, ఇది ప్రేక్షకుల అనుభవాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విమర్శలపై దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల స్పందించారు. ట్రోల్స్‌ను పట్టించుకోనని, తన పని మీదే దృష్టి పెట్టానని ఆయన పేర్కొన్నారు. “కంగువా ఆల్బం నాకు చాలా ప్రత్యేకమైనది. మన్నిప్పు పాటకు ఎంతో మంది ప్రశంసలు అందించారు. సూర్య ఫ్యాన్స్ ఆ పాటను ఎంతో ప్రేమగా స్వీకరించారు. సూర్య గారు కూడా ఫోన్ చేసి మ్యూజిక్ గురించి అరగంట పాటు మాట్లాడారు,” అని దేవి గుర్తు చేసుకున్నారు.

దేవి ప్రకటనలో, ప్రతి సినిమాకీ మంచి చెడులు ఉంటాయని, ‘కంగువా’ కోసం టీమ్ ఎంతో కష్టపడి పని చేసిందని చెప్పారు. “విజువల్స్, సూర్య నటన చూసినా, సినిమా మీద మేము గర్వంగా భావిస్తున్నాం. కొందరికి నచ్చకపోయినా, మాకు మాత్రం ‘కంగువా’ ఎప్పుడూ ప్రత్యేకమే,” అని స్పష్టం చేశారు. మొత్తంగా, ‘కంగువా’ అనేక విమర్శల పాలు అయినప్పటికీ, టీమ్ చేసిన కృషిని దేవి ప్రసాద్ గుర్తు చేశారు.

సైఫ్ పై కుట్ర || Analyst Dasari Vignan EXPOSED Saif Ali Khans Incident || Lawrence Bishnoi || TR