కమెడియన్‌గా సక్సెస్ అందుకోవడంతో ఈ మధ్య ఓ యంగ్ స్టర్ హీరో అయ్యాడు. హీరోగా వచ్చిన ఆయన సినిమా వసూళ్ల పరంగా సక్సెస్ అయ్యింది. దాంతో, ఇంకేముంది.! రెమ్యునరేషన్ పెంచేశాడట. ఓ మోస్తరు డైరెక్టర్లకు అస్సలు దొరకనే దొరకడం లేదట. కోటికి పైనే రెమ్యునరేషన్ అడుగుతున్నాడట.
అయినా, చేతిలో సినిమాలు బాగానే వున్నాయ్. రెండో సినిమా హిట్ అయితే, మూడు కోట్లు కానీ, నాలుగు కోట్లు కానీ, అడగాలనుకుంటున్నాడట. దాంతో ఈ కొత్త హీరోగారి తీరుకు అంతా అవాక్కవుతున్నారు.
పాపులర్ కమెడియన్ అయిన సునీల్‌కి హీరోగా ‘మర్యాద రామన్న’లాంటి హిట్టొచ్చినా నేల మీదే వున్నాడు. అయినా కానీ, షాకుల మీద షాకులు తగిలడంతో అస్సలేమాత్రం మొహమాటపడకుండా, కామ్‌గా మళ్లీ కమెడియన్‌గా సినిమాలు చేసుకుంటున్నాడు.
ఈ సో కాల్డ్ యంగ్ కామెడీ హీరోకి అది ఎప్పుడు తెలిసొస్తుందో.! తెలిసొచ్చే సమయానికి మనోడి పరిస్థితి ఎలా వుంటుందో.!