కమెడియన్ వైవా హర్ష నిశ్చితార్థం.. పిక్స్ వైరల్

Comedian Viva harsha Got engaged

యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింల ద్వారా ఫేమస్ అయ్యాడు హర్ష. వైవా అనే షార్ట్ ఫిలింతో క్రేజ్ తెచ్చుకోవడంతో వైవా హర్షగా మిగిలిపోయాడు. అలా యూట్యూబ్ నుంచి వెండితెరపై మంచి టైమింగ్ ఉన్న కమెడియన్‌గా ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించే స్థాయికి ఎదిగాడు. అయితే హర్ష కమెడియన్ మాత్రమే కాదు మంచి నటుడున్నాడని కూడా నిరూపించుకున్నాడు. ఈ మధ్యే వచ్చిన కలర్ ఫోటో సినిమాతో హర్ష మరో మెట్టు ఎక్కేశాడు.

Comedian Viva harsha Got engaged
Comedian Viva harsha Got engaged

ఇకపై హర్ష నవ్వించడమే కాదు ఏడిపించే పాత్రలు కూడా చేస్తాడేమో. మొత్తానికి హర్షకు మాత్రం 2020 బాగానే కలిసి వచ్చింది. అంతే కాకుండా 2021 మరో మలుపు తిప్పేలా ఉంది. మొత్తానికి హర్ష ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. హర్షకు తాజాగా నిశ్చితార్థం జరిగింది. ఇక పెళ్లి వేసవిలో ఉండొచ్చు. హర్ష ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హర్షకు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.

హర్షది పెద్దలు కుదిర్చిన వివాహామని తెలుస్తోంది. అమ్మాయి పేరు అక్షర. కానీ మిగతా వివరాలేవీ ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ జంటను మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి మార్కులే పడుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ఇద్దరి ఫోటోలే కనిపిస్తున్నాయి. అయితే ఎంగేజ్మెంటే ఇంత గ్రాండ్‌గా జరిపించాడేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక పెళ్లి మరి ఏ రేంజ్‌లో చేసుకుంటాడో చూడాలి.