వెరైటీ పాత్ర‌ల‌లో విక్ర‌మ్.. కోబ్రా టీజ‌ర్‌తో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న చియాన్

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు పెట్టింది విక్ర‌మ్. అమాయ‌కుడిగా క‌నిపించాల‌న్నా, కిల్ల‌ర్ లుక్‌లో మెస్మ‌రైజ్ చేయాల‌న్నా అది విక్ర‌మ్‌కే సాధ్యం. అప‌రిచితుడు చిత్రంలో విక్ర‌మ్ న‌ట‌న‌కు ప‌ర‌వ‌శించ‌ని వారు లేరు. త‌న ప్ర‌తి చిత్రాన్ని కొంత భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వ‌స్తున్న విక్ర‌మ్ ప్ర‌స్తుతం అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న కోబ్రా చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో విక్ర‌మ్ స‌ర‌స‌న ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి కథానాయిక గా న‌టిస్తుంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.

క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డ్డ ఈ చిత్రం ఇప్పుడు తిరిగి షూటింగ్ జ‌రుపుకుంటుంది. 90 శాతానికి పైగా చిత్ర షూటింగ్ పూర్తైన‌ట్టు తెలుస్తుండ‌గా, తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసి మూవీపై భారీ అంచ‌నాలు పెంచారు. ఇందులో విక్ర‌మ్ ప‌లు గెట‌ప్స్‌లో కనిపించి సంద‌డి చేశాడు. అత‌ని ప‌ర్‌ఫార్మెన్స్ అభిమానుల‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌, రాజకీయనాయకుడు, మత భోదకుడు.. ఇలా పలు పాత్రలలో కనిపించి మెప్పించనున్నట్టు స‌మాచారం. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని అంటున్న విక్ర‌మ్ కోబ్రా సినిమాతో ప‌సందైన వినోదం అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఇక కోబ్రా సినిమాతో ఇర్ఫాన్ ప‌ఠాన్ వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ఈ సినిమాలో ఆయ‌న అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో కనిపించ‌నున్నాడు. కేఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.స‌మ్మ‌ర్ వ‌ర‌కు చిత్రాన్ని విడుద‌ల చేసే ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్.