టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని శుక్రవారం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని తాజ్‌లో వీరి పెళ్ళి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్ళి వేడుక జరిగినట్టు తెలుస్తుంది. కాజల్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, నిన్న రాత్రి ఓ ఫోటోని రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో గౌతమ్- కాజల్‌ని చూసి జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
మార్వాడీ సంప్రదాయ పద్దతిలో కాజల్ వివాహ వేడుక జరగగా ఈ వేడుకలో కాజల్ లెహంగాలో మెరిసింది. తాజాగా పెళ్లికి సంబంధించిన మరో మూడు ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఓ ఫోటోలో నూతన దంపతులు ఇద్దరు హోమం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూడముచ్చటగా ఉన్న ఈ జంట నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని అభిమానులు, సెలబ్రిటీలు ఈ న్యూ కపుల్‌ని ఆశీర్వదిస్తున్నారు.
శుక్రవారం నవ వధువుగా మారిన కాజల్ అగర్వాల్ రెడ్ కలర్ లెహెంగాలో కాంతులీనగా, వరుడు గౌతమ్ కిచ్లూ వైట్ కలర్ షేర్వానీలో తలపాగాతో మెరిసాడు. సామాజిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలకు అనుగుణంగా వీరిరివురు వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కరోనా వలన కాజల్ పెళ్ళికి హాజరు కాలేకపోయిన పలువురు హీరోయిన్లు కాజల్‌కు ఇన్‌స్టా ద్వారా విషెస్ తెలియజేశారు. సమంత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అమలా పాల్, కీర్తీ సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, మంచు లక్ష్మి తదితరులు పెళ్ళి శుభాకాంక్షలు తెలియజేస్తూ జంట చూడముచ్చటగా ఉందని కామెంట్స్ పెట్టారు.