ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ మాస్ చిత్రం ఏదైనా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ ల నుంచి రానున్న హ్యాట్రిక్ చిత్రం కోసం అనే చెప్పాలి. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా చేస్తున్న ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ కూడా ఏదో ఒక అడ్డంకి సినిమాని లేట్ చేస్తుంది.
ముందు ఒక సినిమాగా స్టార్ట్ చేసి ఇప్పుడు మొత్తం కథాంశాన్నే మార్చేసి కొత్త సినిమాగా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇలా మాస్ చిత్రంగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా. మరి ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ అదిరే అప్డేట్ సహా ఈ మే 31న అదిరే ట్రీట్ ని కూడా ప్లాన్ చేస్తుండగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా ఓ రూమర్ అయితే మళ్ళీ వచ్చింది.
అదే ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ విషయంలో. ఇది వరకే థమన్ ఈ సినిమాకి ఇస్తున్న వర్క్ మహేష్ కి నచ్చలేదు అని అందుకే వేరే సంగీత దర్శకుణ్ణి పెట్టుకుందాం అని సూచించినట్టుగా రూమర్స్ రాగా అప్పుడు థమన్ సహా నిర్మాత కూడా నవ్వుతూ ఖండించేసారు.
మరి ఇప్పుడు అయితే మళ్ళీ ఇదే టాక్ బయటకి వచ్చింది. అయితే దీనిపై అసలు క్లారిటీ ఏమిటంటే మళ్ళీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. థమన్ నిన్ననే సినిమా గ్లింప్స్ బిజీఎం వర్క్ ని కంప్లీట్ కూడా చేసాడు. అలాగే సినిమా పని మీదే విదేశాలకు కూడా వెళ్లినట్టుగా తెలుస్తుంది దీనితో అయితే థమన్ విషయంలో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పొచ్చు.