పూరి ‘ జనగణమన ‘ పై క్లారిటీ.. ఆ స్టార్ హీరోనే ఫిక్స్ చేసుకున్న పూరి ..?

Puri Jagannath Janaganamana

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో పోకిరి సినిమాని రూపొందించాడు. ఈ సినిమా 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. చెప్పాలంటే ఈ రేంజ్ హిట్ మహేష్ కెరీర్ లో గాని, పూరి కెరీర్ లో గాని మళ్ళీ ఇప్పటి వరకు పడలేదు. ఇద్దరు వేరే వేరే సినిమాలు చేస్తూ వస్తున్నారు. బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. కాని పోకిరి రేంజ్ హిస్టరీని మాత్రం క్రియోట్ చేయలేకపోతున్నారు.

Mahesh Babu Says Sorry To Director Puri Jagannadh | Espicyfilms.com

ఇక పోకిరి తర్వాత పూరి, మహేష్ కలిసి బిజినెస్ మాన్ సినిమాని చేశారు. పక్కా కమర్షియల్ సినిమాగా వచ్చి భారీ సక్సస్ ని అందుకుంది. అయితే ఆ తర్వాత చాలాసార్లు పూరి, మహేష్ బాబు కలిసి మరో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. మహేష్ తో జనగణమన టైటిల్ తో సినిమా తెరకెక్కిస్తానని పూరి చెప్పుకొచ్చాడు. ఎన్నిసార్లు అనుకున్నా ఈ ఇద్దరి కాంబినేషన్ లో మాత్రం మూడో సినిమాగా అనుకున్న జనగణమన మొదలవలేదు.

అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టిన సమయంలో కొంతమంది పూరి ని మీరు మళ్ళీ మహేష్ బాబు తో పోకిరి లాంటి సినిమాని తీయమని రిక్వెస్ట్ చేశారు. అలాగే మహేష్ అభిమానులు చాలా సందర్భాలలో పూరి తో సినిమా చేయమని అడగగా రీసెంట్ గా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నాకు ఇష్టమైన దర్శకులలో పూరి జగన్నాధ్ ఒకరు ..తనకోసం వేయిట్ చేస్తున్నాను..ఆయన వచ్చి కథ నెరేట్ చేస్తే నేను రెడీ.. అంటూ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ చెపాడు.

Puri Jagannath Janaganamana

అంతేకాదు పూరి బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు పూరి కి స్పెషల్ గా విసెష్ చెప్పాడు. అంతేకాదు త్వరలో పూరి తో సినిమా చేయబోతున్నాడన్న టాక్ కూడా మొదలైంది. మహేష్ పరశురాం తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళి తో సినిమా చేయాలనుకున్నా అది కాస్త సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో పూరి జనగణమన ని చేస్తాడని వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు.