వరుస సినిమాలతో విక్రమ్‌ బిజీ..బిజీ!

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్‌ టాలెంటెడ్‌ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు విక్రమ్‌ . ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘తంగలాన్‌ ‘, ‘ధ్రువ నక్షత్రం’ సినిమాల్లో నటిస్తున్న విక్రమ్‌.. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపేశాడని తెలిసిందే. ఈ చిత్రానికి ‘చిన్నా’ ఫేం ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఏప్రిల్‌ 17న విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా వరుస అప్‌డేట్స్‌ రెడీ అవుతున్నాయి. తాజా టాక్‌ ప్రకారం చియాన్‌ 62కు సంబంధించి ఓ మాస్‌ ప్రోమో వీడియోను ఇటీవలే షూట్‌ చేశారట. రేపు ప్రోమో వీడియో/టైటిల్‌ ప్రకటన ఉండబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. అంతేకాదు ‘తంగలాన్‌’ పోస్టర్‌తోపాటు రిలీజ్‌ అనౌన్స్‌మెంట్‌ ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ క్రేజీ అప్‌డేట్స్‌ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

62లో కోలీవుడ్‌ నటి దుషారా విజయన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నట్టు తెలియజేస్తూ రిలీజ్‌ చేసిన లుక్‌ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్‌ అవుతోంది. చియాన్‌ 62లో పాపులర్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఎస్‌జే సూర్య, పాపులర్‌ మలయాళ నటుడు సూరజ్‌ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పా రంజిత్‌ దర్శకత్వంలో అడ్వెంచరస్‌ హిస్టారికల్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ‘తంగలాన్‌’ గ్లింప్స్‌తోపాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ కలిగించడమే కాకుండా అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తుండగా.. పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ కీ రోల్స్‌ పోషిస్తున్నారు.విక్రమ్‌ మరోవైపు గౌతమ్‌ వాసు దేవ్‌ విూనన్‌ డైరెక్షన్‌లో ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం లో నటిస్తున్నాడు. ఈ మూవీలో ‘పెళ్లి చూపులు’ ఫేం రీతూవర్మ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది.