భారీ సెట్టింగ్ లో స్టార్టైన చిరు సినిమా షూట్.!

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాలలో బిజీ అయ్యాక తన పాత రోజుల్లా జెట్ స్పీడ్ లో అయితే ఏకకాలంలో రెండు మూడు సినిమాలు షూటింగ్స్ లో పాల్గొనడం జరిగింది. మరి ఈ సినిమా షూటింగ్ లలో ఆల్రెడీ గాడ్ ఫాదర్ మరియు వాల్తేరు వీరయ్య చిత్రాలని రిలీజ్ కూడా చేసేయడం జరిగింది.

దీనితో ఈ చిత్రాలతో పాటుగా చేసిన మరో చిత్రమే “భోళా శంకర్”. దర్శకుడు మెహర్ రమేష్ తో చేసిన ఈ చిత్రం కూడా దాదాపుగా 80 శాతం కంప్లీట్ కావచ్చింది. మరి ఈ సినిమా తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాలో చిరు రెండు గెటప్స్ లో కనిపించనున్నారు.

మరి ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో కనిపించనుండగా మేకర్స్ అక్కడికి వెళ్లకుండా ఇక్కడే అక్కడి రియలిస్టిక్ సెట్టింగ్ లు వేసేసారు. ఇక అలా ఇప్పుడు సరికొత్త షెడ్యూల్ ని ఈరోజు మొదలు పెట్టినట్టుగా తెలిపారు. మరి ఈ షూటింగ్ కూడా కాళీమాత ఉన్న భారీ సెట్స్ లో స్టార్ట్ చేయగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి అలాగే యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పాల్గొననుంది.

ఇంకా ఈ సినిమాలో తమన్నా చిరు సరసన హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ కొడుకు మహతి సాగర్ చిరంజీవికి ఫస్ట్ టైం మ్యూజిక్ అందిస్తున్నాడు అలాగే అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.