మెగాస్టార్, మెహర్ రమేష్ లాంటి దర్శకుడిపై ఇంట్రెస్ట్ చూపడం హాట్ టాపిక్ గా మారింది.సినిమా ఇండస్ట్రీలో ఒక కమర్షియల్ దర్శకుడికి, డిఫరెంట్ సినిమాలు తీసే దర్శకులకు చాలా తేడా ఉంటుంది. క్రిష్, సుకుమార్, దేవకట్టా లాంటి ఓ వర్గం దర్శకులు డిజాస్టర్స్ తీసినా కూడా వారితో స్టార్ హీరోలు పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకు కారణం వారి మేకింగ్ స్టైల్. సినిమా పోయినా కూడా ఏదో ఒక రకంగా మంచి గుర్తింపు వస్తుందని అనుకుంటారు. ఇక కమర్షియల్ దర్శకులకు సక్సెస్ వచ్చినా కూడా కొంతమంది హీరో లు సినిమా చేయటానికి ఇష్టపడరు .
ఆంధ్రవాలా సినిమాను పునీత్ రాజ్ కుమార్ తో కన్నడలో రీమేక్ చేసి హిట్టు కొట్టాడు . ఆ తరువాత ఒక్కడు సినిమాను కూడా అదే హీరోతో రీమేక్ చేసి విజయం సాధించాడు. ఇక ఆ తరువాత తెలుగులో ఎన్టీఆర్ తో కంత్రి సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా కూడా జస్ట్ మై లక్ అనే హాలీవుడ్ సినిమా కథను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించిందే. అనంతరం ప్రభాస్ తో తమిళ బిల్లాను రీమేక్ చేసి పరవాలేదు అనిపించాడు.
మెహర్ రమేష్ జర్నీలో సొంతంగా రాసుకున్న కథలు తప్పితే మిగతావి డిజాస్టర్స్ గా నిలిచాయి. శక్తి, షాడో సినిమాలు ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ రెండు సినిమాలు కొట్టిన దెబ్బలకు మెహర్ రమేష్ మళ్ళీ కొన్నాళ్ళు కనిపించలేదు. ఇక చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు కథనాలు రావడంతో మెగాస్టార్ ఎందుకు అతనితో సినిమా చేస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
మెహర్ రమేష్ రీమేక్ కథలతో ఇంతవరకు ఫెయిల్ అయితే అవ్వలేదు. వేదళం రీమేక్ కోసం మూడేళ్ళు కష్టపడి స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నాడు. ఆ డెడికేషన్ మరియు స్క్రిప్ట్ మెగాస్టార్ కి చాలా బాగా నచ్చిందట. అందుకే అతని బ్యాక్ గ్రౌండ్ డిజాస్టర్స్ గురించి పెద్దగా ఆలోచించకుండా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. కెరీర్ దాదాపు ఎండ్ అయ్యిందని అనుకున్న సమయంలో రమేష్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలి.