ఊహకందని రేంజ్‌లో చిరు 157…

ఆచార్యనే అనుకుంటే.. అంత కంటే పెద్ద ఫ్లాప్‌ వెంచర్‌గా భోళా శంకర్‌ నిలిచింది. ఈ సినిమా కొట్టిన దెబ్బతో చిత్రయూనిట్‌ మొత్తం అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. రిలీజ్‌ ముందు వరకు ప్రమోషన్‌లతో హడావిడి చేసిన మేకర్స్‌ రిలీజ్‌ తర్వాత సైలెంట్‌ అయిపోయారు. ఇక ఈ సినిమా రిజల్ట్‌ తర్వాత మెగా ఫ్యాన్స్‌ బాధ అంతా ఇంతా కాదు. నిజానికి ముందు నుంచి ఈ సినిమాపై పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవు. అయితే కథ పరంగా చూసుకుంటే మంచి కమర్షియల్‌ సినిమానే. కానీ దర్శకుడు మోహర్‌ రమేష్‌ తన టేకింగ్‌తో కొంచెం కూడా ఆకట్టుకోలేకపోయాడు.

ఇక ఇప్పుడు చిరుకు ఒక మంచి హిట్టు కావాలి. అది కూడా ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే భోళాకు విమర్శలు చేసిన వారే.. ఈ సినిమాకు చప్పట్లు కొట్టేలా. దాని కోసం చిరు గట్టిగా ఆలోచించి బింబిసార దర్శకుడిని రంగంలోకి దింపాడు. బింబిసార తర్వాత దాని సీక్వెల్‌ను తెరకెక్కించాలని ముందుగా ప్లాన్‌ చేసుకున్న వశిష్ట అనుకోని విధంగా చిరు సినిమాను పట్టాలెక్కించాడు. టైటిల్‌ పోస్టర్‌తోనే సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేశారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ అప్‌డేట్‌ను డైరెక్టర్‌ వశిష్ఠ వెల్లడిరచాడు. ఇందులో చిరు వయసు మళ్లిన పాత్రలో కనిపించనున్నాడట. అంటే ప్రస్తుతం చిరంజీవి ఏజ్‌కు తగ్గ రోల్‌ చేయనున్నాడు. విక్రమ్‌లో కమల్‌, జైలర్‌లో రజనీలా వయసుకు తగ్గ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపాడు. ఈ సినిమాలో హీరోయిన్లు ఉంటారు కానీ రొమాన్స్‌ ఉండదని, ఇదొక ఫాంటసీ సినిమా.. ఆ జానర్‌కు తగ్గట్లే సినిమా నడుస్తుందని వశిష్ఠ తెలిపాడు.

అంతేకాకుండా వశిష్ట తన చిన్నతనంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసి ఎంతగానో ఎంజాయ్‌ చేశానని, అప్పటి పిల్లలకు అదొక మధుర జ్ఞాపకమని చెప్పాడు. అదే విధంగా ఇప్పటి పిల్లలు కూడా ఈ సినిమాలో చిరును చూసి ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని మల్లిడి వశిష్ఠ చెప్పుకొచ్చాడు. వశిష్ఠ అప్‌డేట్‌తో కేవలం మెగా ఫ్యాన్సే కాదు సగటు ఆడియెన్స్‌లో సైతం అమితాసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్‌లు ఉండబోతున్నట్లు టాక్‌.. అందులో ఐశ్వర్య రాయ్‌, అనుష్క, మృనాళ్‌ తాకూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ పాన్‌ ఇండియా సినిమాకు అస్కార్‌ గ్రహిత ఎమ్‌.ఎమ్‌ కీరవాణి సంగీతం అందించనున్నాడు.