ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి,సురేఖ దంపతులు!

ప్రారంభమైపోయాయి. ఇటీవల ఓ సాయంత్రం వరుణ్‌, లావణ్యల ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ను కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఈ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ మేరకు వరుణ్‌ తేజ్‌ పెదనాన్న, మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అందమైన ఫొటోలు కూడా షేర్‌ చేశారు.

ఈ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి`సురేఖ దంపతులు, నాగబాబు`పద్మజ దంపతులు, చిరంజీవి ఇద్దరు చెల్లెల్లు, వారి భర్తలు, పిల్లలు సహా రామ్‌ చరణ్‌, ఉపాసన, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, నిహారిక కొణిదెల, చిరంజీవి తల్లి అంజనాదేవి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటకు ఈ ఏడాది జూన్‌ 9వ తేదీన హైదరాబాద్‌లోని నాగబాబు స్వగృహంలో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, చిరంజీవి, అల్లు అరవింద్‌ సహా కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే పాల్గొన్నారు. కాగా, నిశ్చితార్థం జరిగిన మూడు నాలుగు నెలల్లో వరుణ్‌, లావణ్య జంట పెళ్లి పీటలు ఎక్కుతారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇటలీలో పెళ్లి వేడుక జరగనుందని అన్నారు.