మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా విషయమై కొంత ఢీలా పడి వుండొచ్చు. అంత దారుణమైన డిజాస్టర్ చిరంజీవి కెరీర్‌లో ఇంతవరకూ చూడ లేదు మరి.
నిజానికి చిరంజీవి కెరీర్‌లో డిజాస్టర్లు చాలా తక్కువ. ‘ఆచార్య’, ‘భోళా శంకర్’ సినిమాలు కెరీర్‌లో చిరంజీవి అస్సలు గుర్తు పెట్టుకోకూడని సినిమాలుగా చెప్పుకోవచ్చేమో.
కొరటాల శివ, మెహర్ రమేష్ ఇద్దర్నీ చిరంజీవి అంతలా నమ్మారు. మెహర్ రమేష్ చిరంజీవికి బంధువే. అంతకు మించి వీరాభిమాని. ఈ సినిమా చిరంజీవికి ప్లస్పా.? మైనస్సా.? అనే దానికన్నా మోహర్ రమేష్‌కి మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలన్న స్వార్ధమే చిరంజీవిలో ఎక్కువగా చూశాం.
ఆ వుద్దేశ్యంతోనే చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్ల బాధ్యత అంతా తన భుజాలపై వేసుకుని బాధ్యతగా తీసుకున్నారు. కానీ, ఫెయిలైంది.
‘భోళా శంకర్’ అనుభవంతో చిరంజీవి జాగ్రత్త పడడం మొదలుపెట్టారట. రీసెంట్‌గా ఓ కొత్త ప్రాజెక్ట్ చిరంజీవి దగ్గరికి వస్తే, తెరకెక్కించాలనుకున్న దర్శకుడికి ‘జైలర్’ సినిమా చూడమని సలహా ఇచ్చారట.
అంటే ఆ సినిమాని ‘జైలర్’ సినిమా తరహాలో తీయమని కాదు.. ఆడియన్స్ ఎలాంటి సినిమాలకి కనెక్ట్ అవుతున్నారు.. సీనియర్ హీరోల నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు అన్నది తెలుసుకోవాలన్నది చిరంజీవి వుద్దేశ్యం. ఇంతకీ చిరంజీవి రిఫర్ చేసిన ఆ దర్శకుడు ఎవరు.? ఏంటా కథ.? తెలియాల్సి వుంది.