చిరంజీవి కోసం బాలీవుడ్ బ్యూటీని తెస్తున్నారట.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ‘వాల్తేర్ వీరయ్య’తో బాక్సాఫీస్ హిట్ కొట్టి, ‘భోళా శంకర్’ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా వున్నాడు. దీంతో పాటూ, చాలా మంది డైరెక్టర్లను ఎంగేజ్ చేసేశాడు చిరంజీవి. వరుసగా ఆయా సినిమాలన్నీ పూర్తి చేసేయనున్నాడట.

అందులో భాగంగానే చిరంజీవి నటించబోయే తదుపరి చిత్రం కోసం హీరోయిన్‌గా బాలీవుడ్ నటి విద్యా బాలన్ పేరు గుసగుసల్లో వినిపిస్తోంది. ‘గాడ్ ఫాదర్’ లాంటి ఓ స్టైలిష్ సీరియస్ మూవీని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారట. తన ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్‌లో చిరంజీవి నటించాలనుకుంటున్నారట ఈ సినిమా కోసం. ఈ తరహా మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు.

పూరీ జగన్నాధ్, వినాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్. లిస్టులో ఇంకా చాలా మంది డైరెక్టర్లున్నారు. డైరెక్టర్ ఎవరైనా సరే, హీరోయిన్‌గా మాత్రం విద్యాబాలన్‌ అయితే బావుంటుందని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. చూడాలి మరి, గతంలో బాలయ్య కోసం ‘ఎన్టీయార్’ బయోపిక్‌లో నటించింది విద్యా బాలన్. ఇప్పుడు చిరంజీవితో ఏ సినిమాలో నటించనుందో తెలియాల్సి వుంది.