ఇకపై అలాంటివి వద్దంటోన్న చిరంజీవి.!

‘ఆచార్య’ దెబ్బతో మెగాస్టార్ చిరంజీవిలో చాలా చాలా మార్పులొచ్చాయ్. ఇకపై మెగా కాంపౌండ్ హీరోలతో ఫుల్ లెంగ్త్ మూవీస్ వద్దనుకుంటున్నాడట చిరంజీవి.

జస్ట్ ఏదో పాటల్లో కానీ, చిన్న చిన్న గెస్ట్ రోల్స్‌లో కానీ కనిపిChiranjeeviస్తే ఓకే. అంతే తప్ప ‘ఆచార్య’ మాదిరి ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాడట.

ఆయన నటించాల్సిన ఓ కొత్త సినిమా కోసం యంగ్ అవసరం అయితే, చిత్ర యూనిట్ మొదట మెగా కాంపౌండ్ హీరోలనే ట్రై చేశారట. కానీ, చిరంజీవి సింపుల్‌గా నో అనేశారట. దాంతో, వేరే యంగ్ హీరోలను పరిశీలిస్తున్నారట.

ఆ లిస్టులో టిల్లుగాడు సిద్దు జొన్నలగడ్డ తదితర యంగ్ హీరోలున్నట్లు తెలుస్తోంది. మెగా కాంపౌండ్ నుంచే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా కొత్త కొత్త యంగ్ హీరోలున్నప్పటికీ చిరంజీవి వారిని ప్రిఫర్ చేయాలనుకోవడం లేదట.

‘ఆచార్య’ దెబ్బ అంతలా చిరంజీవిపై ఇంపాక్ట్ క్రియేట్ చేసిందన్న మాట. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.