యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే మనం తెరపై చూసే రష్మికి బయట కనిపించే రష్మికి ఎంతో తేడా ఉంటుంది. తెరపై గ్లామర్‌ను ఒలకబోస్తూ ఓ ట్రాకు నడిపిస్తూ నాలుగు సెటైర్లు వేసే రష్మికి.. రియల్ లైఫ్ రష్మిక ఎంతో తేడా ఉంటుంది. రష్మి నిజ జీవితంలోమూగ జీవాల కోసం పోరాడుతుంది. వాటికి ఏమైనా అయితే తల్లడిల్లిపోతుంది. వీధి కుక్కలు ఆకలితో బాధపడుతున్నా చూసి తట్టుకోలేదు.
అందుకే కరోనా సమయంలోనూ రష్మి బకెట్ పట్టుకుని కుక్కలకు ఆహారాన్ని అందించేందుకు రోడ్డు మీదకు వచ్చింది. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. కరోనా లాంటి క్లిష్ట సమయంలో మూగ ప్రాణులకు అండగా నిలిచింది. ఎవరు ఎలాంటి సలహాలు అడిగినా.. ఎక్కడ ఏ కుక్కకు ఏదైనా జరిగిందని ఫిర్యాదు చేసినా స్పందించేది. తక్షణం సహాయక చర్యలు చేపట్టేది. అలాంటి రష్మికి తాజాగా ఓ అవార్డు లభించింది. కరోనా సమయంలో పోరాడిన కొందరికి ఓ సంస్థ అవార్డులు ప్రధానం చేసింది.
ఆ అవార్డులు చిరంజీవి చేతుల మీదుగా ప్రధానం చేయించారు. అలా చిరు చేతుల మీదుగా రష్మీ అవార్డు అందుకుంది. ఆ కార్యక్రమంలో రష్మీ మాట్లాడిన మాటలకు చిరు సంబరపడిపోయాడు. కరోనా అనేది జంతువులకు రాదు.. అది మనషులను హెచ్చరించడానికి దేవుడు పంపాడు అని రష్మి చెప్పిన మాటలను చిరంజీవి తన ప్రసంగంలో మళ్లీ ప్రస్థావించాడు. రష్మిని ప్రత్యేకంగా అభినందించాడు. రష్మీ ఆ విషయం ఎంతో చక్కగా చెప్పిందని చిరు కితాబిచ్చాడు.