గోదావరి జిల్లా వాసిగా చిరు సినిమా!?

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌ తో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ మూవీని వశిష్ట మల్లిడి సిద్ధం చేస్తున్నారు. ‘బింబిసార’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత వశిష్ట నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్‌ అందిస్తున్నారు. స్టార్‌ టెక్నిషియన్స్‌ వర్క్‌ చేస్తున్నారు. మెగాస్టార్‌ కి జోడీగా లీడ్‌ హీరోయిన్‌ కోసం వేట సాగుతోంది. ఇక మూవీలో సునీల్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. అది పాత్ర కంప్లీట్‌ హ్యూమరిక్‌ టచ్‌ తో ఉంటుందంట. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి మొదటి సారి గోదావరి జిల్లావాడిగా కనిపించబోతున్నారంట. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో గోదావరి బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చినవి చాలా తక్కువ. విశ్వంభర మూవీ మాత్రం గోదావరి బ్యాక్‌ డ్రాప్‌ లో ఉంటుందంట.

అలాగే మెగాస్టార్‌ పాత్ర పేరు సినిమాలో దొరబాబు అని టాక్‌ వినిపిస్తోంది. అలాగే సునీల్‌ రోల్‌ కూడా గోదావరి స్టైల్‌ లోనే ఉంటుందంట. వీరిద్దరి కాంబోలో వచ్చే కామెడీ సినిమాలో హైలైట్‌ గా నిలుస్తుందనే మాట వినిపిస్తోంది. జగదీక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ సినిమా కాన్సెప్ట్‌ ఉంటుందంట. అయితే పంచభూతాలు అనేవి ఈ చిత్రంలో కీలక ఎలిమెంట్స్‌ గా ఉంటాయని టాక్‌.

మెగాస్టార్‌ సెకండ్‌ ఇన్నింగ్‌ లో కంప్లీట్‌ డిఫరెంట్‌ లైన్‌ లో చేస్తోన్న సినిమా ఇదే కావడంతో విశ్వంభర విూద ఎక్స్‌ పెక్టేషన్స్‌ హై ఎండ్‌ లోనే ఉన్నాయి. వశిష్ట మల్లిడి విూద కూడా చాలా పెద్ద బాద్యతలు ఉన్నాయి. కళ్యాణ్‌ రామ్‌ ని అయితే బింబిసార సినిమా సమయంలో వశిష్ట భాగానే హ్యాండిల్‌ చేశారు. అయితే మెగాస్టార్‌ చిరంజీవిని అతను ఏ మేరకు హ్యాండిల్‌ చేసి తాను అనుకున్న కాన్సెప్ట్‌ ని అనుకున్న స్థాయిలో సిల్వర్‌ స్కీన్ర్‌ పై ఆవిష్కరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.