ఈ మాయదారి కరోనా అన్ని రంగాలను నాశనం చేసేసింది. ఎప్పుడూ లేనంతగా… ప్రతి ఒక్కరు కరోనా వల్ల బాధపడుతున్నవాళ్లే. చేతిలో చిల్లిగవ్వ లేక బతుకులు సాగిస్తున్నారు కొందరు. లక్షాధికారులు కూడా కరోనా ఎఫెక్ట్ తో అన్నీ పోగొట్టుకున్నారు. అసలు పని దొరకాలంటేనే ఎంతో కష్టంగా మారింది.
కరోనా సినిమా ఇండస్ట్రీని కూడా బాగా దెబ్బకొట్టేసింది. కరోనా మన దేశంలోకి ఎంట్రీ ఇవ్వగానే.. లాక్ డౌన్ విధించడంతో అన్ని సినిమా ఇండస్ట్రీలలో షూటింగులు ఆగిపోయాయి. దీంతో సినీ రంగానికి పెద్ద దెబ్బ పడింది.
చిన్న చిన్న ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ .. సినీ ఇండస్ట్రీ ద్వారా ఉపాధి పొందుతున్నవాళ్లంతా ఇప్పుడు ఉపాధి లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కొన్ని రోజుల క్రితమే షూటింగులు జరుపుకోవచ్చంటూ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. కరోనా ఉదృతి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో… కొందరు హీరోలు షూటింగ్ లకు వెళ్లడానికి బయపడుతున్నారు.
కొందరు హీరోలు ధైర్యంగా ముందుకెళ్లి షూటింగ్ లు జరుపుకుంటున్నా… ఏ ఒక్కరికి కరోనా వచ్చినా మూవీ యూనిట్ మొత్తం బాధపడాల్సి వస్తుందన్న భయం మరోవైపు ఉంటోంది.
తెలుగులో సీనియర్ హీరోలు కూడా తమ సినిమాలను సెట్స్ మీదికి తీసుకెళ్తున్నారు. బాలకృష్ణ కూడా తన బీబీ3 సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. నాగ్ కూడా అంతే వైల్డ్ డాగ్ తో పాటుగా బిగ్ బాస్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు.
ఇక.. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీనే ఇంకా సెట్స్ మీదికి వెళ్లలేదు. నిజానికి ఆచార్య సినిమా షూటింగ్ లో భాగంగా ముందుగా రామ్ చరణ్ మీద తెరకెక్కించాల్సిన సీన్లను తీయనున్నట్టు తెలిసింది. ఎందుకంటే.. రామ్ చరణ్.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే.. ముందుగా ఆయన సీన్లను తీసేసి.. తర్వాత నెమ్మదిగా మిగితా షూటింగ్ చేసుకోవచ్చనేది మూవీ యూనిట్ ఉద్దేశం.
కానీ.. అసలు ఆచార్య షూటింగ్ ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు. కొరటాల శివ మాత్రం షూటింగ్ కు రెడీ అయిపోయాడట. కానీ.. చిరంజీవి నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు అనే మాట వినవస్తోంది. చిరు షూటింగ్ కు ఓకే అంటే ఇక షూటింగ్ చకచకా పూర్తి చేసుకోవడమేనని తెలుస్తోంది. అయితే..కరోనా నేపథ్యంలోనే చిరంజీవి కాస్త అటూ ఇటూ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని రోజులు ఆగితే వాక్సిన్ గట్రా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారో లేక.. ఇంకొన్ని రోజుల్లో వైరస్ ఇంకాస్త బలహీనపడుతుందని ఆలోచిస్తున్నారో అని ఫిలింనగర్ టాక్.