Chiranjeevi : ఆచార్య సినిమా చిరు, చరణ్ కలిసి నటించిన చిత్రం. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అంతే ఆత్రుతగా ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు స్పీచ్ కోసం ఎదురుచూశారు. చిరు ఇప్పటి కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాల జోరు పెంచారు. ఇక ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు స్పీచ్ ఆకట్టుకుంది.తన పేరు శివశంకర వరప్రసాద్ అని శివుడు నృత్యానికి ప్రసిద్ధి కాగా శివుని ముందు ఎవరైనా డ్యాన్స్ చేయగలరా అని చిరంజీవి కామెంట్లు చేశారు.
తాము డాన్స్ చేస్తున్నాం అనుకుంటారు కానీ ఎవరైనా శివుడి తరవాతే.. ఆ శివతాండవం తరువాతే ఎవరైనా అంటూ. మిగతా హీరోలను ప్రోత్సహించాలి కాబట్టి అపుడపుడు నేను తగ్గుతా అంతే తప్ప డాన్స్ లో నేనే కింగ్ అంటూ పరోక్షంగా చెప్పారు. ఇక రాజమౌళి ముఖ్యఅతిథీ గా హాజరైన ఈ ఈవెంట్ లో రాజమౌళి ని ఆకాశానికి ఇతరుల చిరు . ఆయన ఈ ఈవెంట్ కీ రావడం గర్వంగా ఉందని చెప్తూ… ఆయనను మఠాధిపతితో పోల్చారు. ఇండియన్ సినిమా లో తెలుగు సినిమాను ముందుంచారాని పొగిడారు.
ఆచార్య సినిమాతో చిరంజీవి, చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 66 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి యాక్టివ్ గా ఉంటూ అద్భుతంగా డ్యాన్స్ లు చేస్తూ ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేస్తున్నారు. ఆచార్య సినిమా నక్సలిజం కథాంశంతో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. చిరంజీవి, చరణ్ లను హైలెట్ చేస్తూ ఈ సినిమాకు ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఈ సినిమా కోసం చిరు,చెర్రీ పారితోషికం తీసుకోలేదు. ఆచార్య పాన్ ఇండియా సినిమా గా విడుదలవడం లేదు.