ఐదారుగురు నిర్మాతలు ఈ మధ్య చిరంజీవి చుట్టూ తిరుగుతున్నారట కొన్ని రీమేక్ సబ్జెక్టులు పట్టుకుని. అవును నిజమే, ఓ మంచి సబ్జెక్ట్‌ని వీలైనన్ని భాషల్లో చెబితే తప్పేముంది.. ఇది ఇటీవల ‘భోళా శంకర్’ టైమ్‌లో చిరంజీవి చెప్పిన మాట.
అదీ నిజమే కాదనలేం. కానీ, ఓటీటీ ట్రెండ్ అందుబాటులో వున్న నేటి కాలంలో, లాంగ్వేజ్‌తో పనేముంది.. అన్ని సినిమాలూ ఇంట్లోనే అందుబాటులో వుంటున్నాయ్.
హీరోతో డైరెక్టర్‌తో పాపులారిటీతో పని లేదు. సబ్జెక్ట్ బాగుంటే విశేషమైన ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పని గట్టుకుని రీమేకుల చేయడం వల్ల ఒరిగేదేముంది.! తేడా కొడితే, ఫ్లాప్ అని ముద్ర వేయించుకోవడం తప్ప.!
అందుకే నిన్న మొన్నటి వరకూ రీమేకుల్ని ఎంకరేజ్ చేసిన చిరంజీవి ఇప్పుడు అస్సలు ఎంకరేజ్ చేయడం లేదట. ‘భోళా శంకర్’ దెబ్బతో గట్టిగా నిర్ణయించుకున్నారట.
ఈ సారి రీమేకుల విషయంలో కాస్త గట్టిగా ఆలోచించాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట సినిమా. దీంతో పాటూ, మరో యంగ్ డైరెక్టర్‌తోనూ స్ర్టెయిట్ మూవీనే చేస్తున్నారు చిరంజీవి.
అయితే, పూర్తిగా రీమేక్ సబ్జెక్టుల్ని చిరంజీవి పక్కన పెట్టేయలేదట. ఆచి తూచి, ఎంచుకుని చేస్తారట. ఇప్పటికిప్పుడయితే, రెండు డైరెక్ట్ సినిమాలు చేసేసి, ఆ తర్వాత ఓ రీమేక్ టేకప్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
రెండు స్ర్టెయిట్, మధ్యలో ఓ రీమేక్.. ఇలా ఓ ప్యాటర్న్ ఫాలో చేయాలనుకుంటున్నారట. చూడాలి మరి.