దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వాడు మాత్రమే కాదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్‌లాంటి వాడు. అలాంటి రాజమౌళి పుట్టిన రోజుకు చిరంజీవి ట్వీట్ చేయలేదు. చిరంజీవి అంత యాక్టివ్‌గా ఉండడని అనుకుంటే అది పొరపాటే. ట్విట్టర్‌ను ఆట ఆడుకుంటాడు. ట్విట్టర్‌లో చిరు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎవరికి ఎలా పంచ్ ఇవ్వాలో చిరుకు బాగా తెలుసు.
అలాంటి చిరంజీవి రాజమౌళి బర్త్ డేకు ఓ ట్వీట్ కూడా వేయలేదు. రాజమౌళి బర్త్ డే గురించి తెలియదు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. మామూలుగా చిరు అందరి బర్త్ డేలకు ట్వీట్ వేయడు. చాలా సెలెక్టివ్ పర్సనాలీటీలకు మాత్రమే విష్ చేస్తాడు. అయితే సోషల్ మీడియాలో స్పందించకపోయినా వ్యక్తిగతంగా విష్ చేసి ఉంటాడని కొందరు అంటున్నారు. మామూలుగా చిరు అలానే విష్ చేస్తాడు. ఇంటికి పిలుపించుకోవడమో లేదా వారి వారి ఇంటికే గిఫ్ట్‌లు పంపించడమో చేస్తాడు.
మొన్న వినాయక్ బర్త్ డే రోజున కూడా అతని ఇంటి బహుమతిని పంపాడు. అలా రాజమౌళికి కూడా పర్సనల్‌గా కాల్ చేసి ఉంటాడని అంటున్నారు. నిన్న రాజమౌళి విషయంలో ట్వీట్ వేయని చిరు.. నేడు అమితాబ్ బచ్చన్ బర్త్ డే అని ఇంత ఉదయాన్నే ట్వీట్ వేశాడు. మరి రాజమౌళి విషయంలో చిరు ఎందుకు చేయలేదనేది కొందరి వాదన.