రవితేజ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్.?

మాస్ రాజా రవితేజ సినిమాకి మెగా గ్లామర్ అద్దబోతున్నారట. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో మాస్ రాజా రవితేజ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ బాగా వర్కవుట్ అయ్యింది.

సినిమా సూపర్ హిట్ అవ్వడం.. రవితేజ పాత్ర కూడా బాగా పేలడం.. అటు రవితేజ ఫ్యాన్స్‌నీ ఖుషీ చేసింది. అదే టైమ్‌లో ‘ధమాకా’ హిట్టు కొట్టి వున్న రవితేజకు డబుల్ ధమాకా అయ్యింది ‘వాల్తేర్ వీరయ్య’. అన్నయ్యా.! అని నోరారా పిలిచినందుకు ఆయన సినిమాలో గుర్తుండిపోయే గెస్ట్ రోల్ చేసి రవితేజ అలా రుణం తీర్చుకున్నాడన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయ్ రవితేజపై.

ఆ స్థాయిలో ఆ పాత్ర ఆకట్టుకుంది ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో. ఇక, ఇప్పుడు రవితేజ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అవతారమెత్తబోతున్నారనీ సమాచారం. ప్రస్తుతం రవితేజ చాలా సినిమాలు చేస్తున్నారు. అందులో ఏ సినిమా కోసం చిరంజీవి నటిస్తున్నారో తెలీదు కానీ, ఓ సినిమాలో సర్‌ప్రైజింగ్ రోల్‌లో చిరంజీవి నటించబోతున్నారట.

పది నుంచి పదిహేను నిమిషాల నిడివి వున్న పాత్రగా చెబుతున్నారు. అవసరమైతే మరో ఐదు నిమిషాలు కూడా ఈ పాత్ర వుండొచ్చని అంటున్నారు.

రవితేజ రిక్వెస్ట్ మీదే ఈ పాత్రలో కనిపించడానికి చిరంజీవి ఒప్పుకున్నారట. పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా వుండబోతోందట. చూడాలి మరి, చిరంజీవి కాంబో రవితేజకి ఏ రేంజ్‌లో కలిసొస్తుందో.!

అన్నట్లు త్వరలోనే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.