బాలయ్య – చిరంజీవి మల్టీస్టారర్‌కి స్కెచ్.!

‘చిరంజీవి, బాలకృష్ణ.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా నిర్మించాలనుకుంటున్నాను..’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సినిమా జనాల మాటలకు అర్థాలు వేరులే.. అనంటే, ఏం చేయలేం. కానీ, కొన్ని కాంబినేషన్లకు విపరీతమైన క్రేజ్ వుంటుంది. దాంతోపాటే, చాలా కాంప్లికేషన్స్ కూడా వుంటాయ్. అయితే, సినీ పరిశ్రమలో మరింత హెల్తీ ఎట్మాస్ఫియర్ కోసం.. హీరోలు, బౌండరీల్ని చెరిపేస్తున్నారు.

‘అల్లు అరవింద్ సినిమా నిర్మిస్తానంటే, బాలకృష్ణతో చేయడానికి నేను సిద్ధమే..’ అని చిరంజీవి కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. సో, ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రముఖ దర్శకుడు కథ సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయాడట.

అయితే, సినిమా నిర్మాణం విషయంలో రెండు పెద్ద బ్యానర్లు ప్రస్తుతానికి రేసులోకి వచ్చాయన్నది తాజా ఖబర్. కానీ, ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. అలాగని అసాధ్యమూ కాదు.! లెట్స్ వెయిట్ ఫర్ కంప్లీట్ డిటెయిల్స్.!