గత కొన్ని రోజులు కితం కోలీవుడ్ కి చెందిన కాంట్రవర్సియల్ నటుడు మన్సూర్ అలీఖాన్ తాను రీసెంట్ గా నటించిన చిత్రం “లియో” సినిమాలో హీరోయిన్ అయినటువంటి త్రిష కృష్ణన్ పై పలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలని అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఖండించగా మన తెలుగు సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.
అయితే ఈ విషయంలో మన్సూర్ అలీఖాన్ ఓ ప్లాన్ వేసుకోగా అది కాస్త అతడికి రివర్స్ అయ్యింది. చిరు, త్రిష అలాగే నటి ఖుష్భులు తనని డీ ఫేమ్ చేసారని అందుకే వారి మీద కేసు వేసి పరువు నష్టంగా తనకి డబ్బులు చెల్లించాలి అని డిమాండ్ చేసాడు. కానీ ఈ కేసుని కొట్టేస్తున్నట్టుగా గత కొన్ని రోజులు కితం అప్డేట్ వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి మరో న్యూస్ వైరల్ గా మారుతుంది. దీని ప్రకారం అయితే చెన్నై హై కోర్ట్ మన్సూర్ కేసుని కొట్టేయడమే కాకుండా అతడికి ఒక లక్ష రూపాయల జరిమానా కూడా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. తాను వారి మీద ఫాల్స్ కేసు వేయడమే కాకుండా ఇలాంటి కేసులు వేసి విలువైన న్యాయ స్థానం సమయాన్ని వృధా చేసినందుకు మన్సూర్ కి ఫైన్ వేసినట్టుగా తెలిపారు.
దీనితో మన్సూర్ కి మాత్రం మరో షాక్ తగిలింది అని చెప్పాలి. ఇక మన్సూర్ త్రిష లు నటించిన లియో లో హీరోగా దళపతి విజయ్ నటించగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. లోకేష్ కూడా మన్సూర్ ని తప్పుడుబట్టాడు కానీ అతన్ని ఏమనకుండా ఉండడం విశేషం.