చైతన్య సింప్లిసిటీ ఇష్టం.. కొత్త జీవితం గురించి శోభిత కామెంట్స్!

ఇన్ని రోజులూ పెళ్లి పనులు, తర్వాత పెళ్లి, ఆ తర్వాత దైవదర్శనాలతో బిజీగా ఉన్న అక్కినేని నాగచైతన్య జంట ఇప్పుడిప్పుడే కొంత విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ మధ్యనే ఈ జంట శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని అక్కడ పూజలు కూడా చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధూళిపాళ శోభిత కాస్త అక్కినేని శోభితగా మారిన తర్వాత శోభిత అత్తారింట్లో గడుపుతున్న జీవితం గురించి అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.

ఇన్నాళ్లు బిజీగా ఉన్నా శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే అక్కినేని ఇంటిలో కోడలిగా తన జీవితం గురించి కూడా చెప్పుకొచ్చింది. చైతన్య నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను, చైతన్య నుంచి నేను ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాను. అతని సింప్లిసిటీ, అందరితో గౌరవంగా ఉండే విధానం తనకి బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. అలాగే వంట విషయంలో కూడా అతనికి ప్రాక్టీస్ ఉందని, ముద్దపప్పు ఆవకాయ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతానని చెప్పింది.

కెరియర్ మొదట్లో తనికి అందం ఆకర్షణ లేదని, కనీసం బ్యాగ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అంటూ నన్ను రిజెక్ట్ చేసే వారని కానీ పట్టుదలతో నన్ను రిజెక్ట్ చేసిన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పిన శోభిత తనకి కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేయటం ఇష్టమని, పుస్తకాలు చదవడం కవిత్వం రాయటం తనకి ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చింది.

అలాగే ఈ మధ్యనే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవటం తనకి ఎంతో ప్రశాంతత నిచ్చిందని, చిన్నప్పటినుంచి దైవభక్తి తన జీవితంలో భాగమని చెప్పుకొచ్చింది. అయితే కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త ప్రాజెక్టులు ఏవీ కనిపించడం లేదు, ఇప్పుడే పెళ్లి చేసుకొని ఒక పెద్దింటికి కోడలు అయింది కదా కొన్ని రోజుల తర్వాత మళ్లీ కెరియర్ పై దృష్టి పెడుతుందేమో చూడాలి.