ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కెప్టెన్‌ మిల్లర్‌’

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ వరుస సినిమాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ స్టార్‌ హీరో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవాప్తంగా 1600కుపైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. కాగా కెప్టెన్‌ మిల్లర్‌ తెలుగు విడుదల తేదీపై ఏదో ఒక వార్త నెట్టింట హల్‌ చల్‌ చేస్తూనే ఉంది.

తాజాగా ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు విడుదలవుతుందని తెలియజేస్తూ కొత్త డేట్‌ను ప్రకటించారు. కెప్టెన్‌ మిల్లర్‌ తెలుగు రాష్టాల్ల్రో జనవరి 25న విడుదల కానున్నట్టు వెల్లదించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఏసియన్‌ సినిమాస్‌ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి. ధనుష్‌, శివరాజ్‌కుమార్‌, ప్రియాంక మోహన్‌ తమ యాక్టింగ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ఇప్పటివరకు వచ్చిన టాక్‌ చెబుతోంది.

విప్లవయోధుడు కెప్టెన్‌ మిల్లర్‌ స్పూర్తితో వస్తోన్న ఈ మూవీలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ , టాలీవుడ్‌ యాక్టర్‌ సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌, అమెరికన్‌ యాక్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్‌ తెరకెక్కిస్తున్న కెప్టెన్‌ మిల్లర్‌ ఆడియో రైట్స్‌ను పాపులర్‌ మ్యూజిక్‌ లేబుల్‌ సరిగమ సొంతం చేసుకుంది.