రవితేజ కొత్త ప్రాజెక్ట్ లాక్ చేశాడు.! ఈసారైనా హిట్టు కొడతాడా.?

రవితేజ హీరోగా ఈ మధ్యనే ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా వచ్చింది. అది కాస్తా డిజాస్టర్ అనిపించుకుంది. అంతకు ముందు వచ్చిన ‘రావణాసుర’ కూడా అంతే. సంక్రాంతికి ‘ఈగల్’ సినిమాతో రాబోతున్నాడు రవితేజ. ఇంతలోనే, హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా.. అంటూ ప్రచారం జరుగుతోంది.

తాజాగా, ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యింది. త్వరలోనే అధికారిక ప్రకటన.. దాంతోపాటే, సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం జరిగిపోతాయట.

అనుదీప్ సినిమా అంటే, కంప్లీట్ ఎంటర్టయినర్ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, అనుదీప్ సినిమా అంటే, లాటరీ వ్యవహారమే. ‘జాతి రత్నాలు’ జాక్ పాట్. మళ్ళీ అలాంటి మ్యాజిక్ అంత తేలిక కాదు.!

రవితేజ సంగతి సరే సరి.! ఈ మధ్య కథల ఎంపికలో పొరపాట్లు చేస్తున్నాడు, మరీ బోర్ కొట్టించేస్తున్నాడు కూడా.! ఈ క్రమంలో, అనుదీప్ – రవితేజ సినిమా అంటే, ఒకింత రిలీఫ్ అవ్వొచ్చు. అదే సమయంలో, రొట్ట కాంబినేషన్‌గానూ మిగిలిపోవచ్చు. రవితేజ సినిమా అంటేనే అంత.!

ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారాన్ని బట్టి తెలుస్తున్నదేంటంటే, తక్కువ రోజుల్లో.. లిమిటెడ్ బడ్జెట్‌తో అనుదీప్ – రవితేజ సినిమాని రూపొందించేయబోతున్నారట. నమ్మొచ్చా.?