Ravi Basrur : టాలీవుడ్ లో థమన్ కి ఆ మ్యూజిక్ డైరెక్టర్ పోటీ గా వస్తాడా…?

Ravi Basrur : ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో థమన్ కొనసాగుతున్నాడు. వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో వున్నాడు థమన్.ఇటీవల వచ్చిన నందమూరు బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా అఖండ ఇంకా పవర్ స్టార్ భీమ్లా నాయక్ సినిమాల హిట్ తో థమన్ కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలలో్ పాటలకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు పడ్డాయ్.

అయితే తాజాగా వచ్చిన కేజీఫ్ 2 సినిమా లో కూడా పాటలతో పాతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు పడ్డాయ్.కేజీఫ్ 2 సినిమాకి సంగీత దర్శకులుగా రవి బస్రూర్ పనిచేశారు.కేజీఎఫ్ లో రాఖీభాయ్ థీమ్ మ్యూజిక్, మదర్ సెంటిమెంట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. తన అద్భుతమైన మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ తో కొన్ని ఆర్డినరీ సీన్లను కూడా ఎక్స్ట్రార్డినరీ గా మార్చాడు రవి బస్రుర్.

త్వరలోనే రవి బస్రుర్ నుండి ఒక డైరెక్ట్ తెలుగు సినిమా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతలా ఫిలిం ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగిపోతుంది.రాజమౌళి కి ప్రశాంత్ సమఉజ్జిగా ఎలా అవతరించాడో థమన్ కి రవి బస్రూర్ పోటీ ఇవ్వనున్నాడు ఇండస్ట్రీ వర్గాల టాక్.థమన్ లాగే రవి బస్రూర్ కి కూడా వరుస హిట్లు వస్తే పోటీ ఖాయం అని అంటున్నారు.