ఆల్రెడీ భారీ బిజినెస్ స్టార్ట్ చేసిన చిరు “విశ్వంభర”?

ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమా నుంచి మన సూపర్ సీనియర్ హీరోస్ కూడా తమ ఏజ్ కి తగ్గ సినిమాలు మాత్రమే కాకుండా వారి ఫ్యాన్స్ కూడా ఎలాంటి సినిమాలు కోరుకుంటారో ఆ తరహా సినిమాలు చేస్తున్నారు. కాగా అలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సినిమానే “విశ్వంభర”.

టాలీవుడ్ ఫాంటసీ హిట్ చిత్రం బింబిసార చిత్రం దర్శకుడు వశిష్ట ఈ చిత్రం గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టైటిల్ గ్లింప్స్ తో ఒక ఊహించని ట్రీట్ ఇచ్చాడు. కాగా ఈ చిత్రానికి అయితే ఇప్పుడు యూఎస్ మార్కెట్ లో మంచి ఫిగర్ తో థియేట్రికల్ డీల్ కంప్లీట్ అయ్యిపోయినట్టుగా సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ యూఎస్ మార్కెట్ లో భారీ మొత్తం 18 కోట్లు చెల్లించి విశ్వంభర హక్కులు సొంతం చేసుకున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఫిగర్ లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు ఏమో కానీ విశ్వంభర బిజినెస్ మాత్రం యూఎస్ లో పూర్తి చేసేసారట.

మరి ఇంకా ఎలాంటి ఫస్ట్ లుక్ లాంటిది కూడా లేకుండా ఇప్పుడే బిజినెస్ కంప్లీట్ అయ్యిపోవడం విశేషం. ఇంకా ఈ బార్క్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు సుమారు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.