చాలా మంది నటులలో ఒక్క నటన మాత్రమే కాకుండా సినిమాకి సంబంధించి అనేక టాలెంట్స్ కూడా ఉంటాయి. మరి అలా కోలీవుడ్ నుంచి నటునిగా వచ్చి ఇప్పుడు తెలుగులో కూడా స్థిరపడిన ప్రముఖ నటుడు అలాగే దర్శకుడు “సముద్రఖని”. మరి సముద్రఖని ఇప్పుడు తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటిస్తుండగా ఇప్పుడు నటనతో పాటుగా దర్శకునిగా కూడా తాను టాలీవుడ్ లో ఇప్పుడు పరిచయం అవుతున్నారు.
అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో అయితే ఇప్పుడు సినిమా చేస్తున్నారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న ఈ సినిమానే “బ్రో ది అవతార్”. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సముద్రఖని అయితే పవన్ కి మరింత సన్నిహితం అయ్యిపోయారు.
అయితే సముద్రఖని లేటెస్ట్ పవన్ పై పలు సంచలన కామెంట్స్ చేయడం అయితే వైరల్ గా మారింది. తాను ఇప్పుడు పవన్ తో 100 సినిమాలు చేయడానికి కూడా సిద్ధమని జస్ట్ పవన్ నుంచి నాకు కాల్ వస్తే చాలు నేను రెడీ అని తెలిపారు. అంతే కాకుండా తన దగ్గర చాలా స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయని..
పవన్ ఓకే అంటే మరో సినిమా డైరెక్టర్ గా తప్పకుండ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. దీనితో సముద్రఖని పవన్ మధ్య బాండింగ్ ఏ లెవెల్లో ఫిక్స్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.